ఓటింగ్ లో భారీ మార్పులు.. జోకర్లుగా మారుతున్న స్ట్రాంగ్ కంటెస్టెంట్స్!
on Oct 18, 2024
బిగ్ బాస్ సీజన్-8 లో నామినేషన్ లో ఉన్నవారికి ఓటింగ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. హౌస్ లో బాగా ఆడుతున్న కంటెస్టెంట్స్ ఓటింగ్ లేదు.. ఇక వీడెందుకు ఉన్నాడో తెలియదు అన్నవారికి ఓటింగ్ ఉంది.
మొదట్లో మణికంఠ అంటే కాస్త సింపథీ ఉండేది జనాలకి.. అయితే వారాలు గడుస్తున్న కొద్దీ నెమ్మదిగా ఆ అభిప్రాయం మారుతుంది. ఎందుకంటే నామినేషన్స్‌లో కనిపించే మణికంఠ.. ఆ తర్వాత కనిపించే మణిబాబులో చాలా డిఫరెన్స్ ఉంది. గేమ్ లో డిఫరెంట్ స్ట్రాటజీతో ముందుకెళ్తున్నాడు. గేమ్ మొదలయ్యేముందు నేనేం ఆడను అన్నాడు.. గేమ్ మొదలయ్యాక తన స్ట్రాటజీతో ఆట స్వభావాన్ని మార్చేశాడు. దాంతో నామినేషన్ లో ఉన్న మణికంఠకి భారీ ఓటింగ్ పడుతోంది. మొదటి స్థానంలో నబీల్ , రెండో స్థానంలో నిఖిల్, మూడో స్థానంలో మణికంఠ కొనసాగుతున్నారు.
ప్రేరణ, యష్మీలకి నామినేషన్ లో తక్కువ ఓటింగ్ పడుతోంది. ఇక చివరి నాలుగు స్థానాల్లో గౌతమ్ కృష్ణ, పృథ్వీ, టేస్టీ తేజ, హరితేజ ఉన్నారు. అయితే నిన్నటి ఎపిసోడ్ లో గౌతమ్ తన ఆటతీరుతో ఒక్కసారిగా టాప్ ఓటింగ్ వచ్చేసింది. ఇక యష్మీ, ప్రేరణలు గేమ్ బాగా ఆడుతున్నప్పటికి ఓటింగ్ తక్కువగా పడుతోంది. ఇక టేస్టీ తేజ, హరితేజ ఎంటర్టైన్మెంట్ చేస్తున్నా వారికి ఓటింగ్ పడట్లేదు. అయితే ఈ వారం ఎలిమినేషన్ కి దగ్గరలో హరితేజ , టేస్టీ తేజ ఉన్నారు. అయితే ఈరోజు వీరిద్దరిలో ఎవరికైనా ఓటింగ్ ఎక్కువ పడితే పృథ్వీ డేంజర్ జోన్ లోకి వచ్చేస్తాడు. ఇక ఈ వారం డబుల్ ఎలిమినేషన్ అనే వార్తొలుస్తున్నాయి. అదే జరిగితే టేస్టీ తేజ , హరితేజ ఎలిమినేషన్ అవుతారు.
Also Read